ఉదయం ఇద్దర్ని కాపాడి.. సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

ఉదయం ఇద్దర్ని కాపాడి.. సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు

పెద్దాపురం, న్యూస్‌టుడే: ఉదయం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఓ యువకుడు కారులో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాడు. సాయంత్రం వేరే పనిపై వెళ్తుండగా కారు ఢీకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రహదారిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సామర్లకోటలో ఉదయంపూట జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులను ప్రజ్వల్‌దేవ్‌ కారులో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చాడు. సాయంత్రం స్పోర్ట్స్‌ బైక్‌పై పెద్దాపురం నుంచి సామర్లకోటకు వెళుతున్నాడు. ఏడీబీ రహదారిలో ఓ పామాయిల్‌ పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రజ్వల్‌ దేవ్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటివరకు తమ కళ్ల ఎదుటే ఉన్న కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు ప్రసాద్‌, జ్యోతి కన్నీరుమున్నీరయ్యారు. పెద్దాపురం ఎస్సై మురళీమోహన్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పెద్దాపురం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని