ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు అర్హత
eenadu telugu news
Published : 21/10/2021 03:54 IST

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు అర్హత

మద్దినేని ఉమామహేష్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హరియాణా రాష్ట్రం పంచకులలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్‌ (అండర్‌-19) గేమ్స్‌కు విజయవాడకు చెందిన మద్దినేని ఉమామహేష్‌ అర్హత సాధించాడని రాష్ట్ర రైఫిల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి డి.రాజ్‌కుమార్‌ తెలిపారు. దిల్లీలోని డాక్టర్‌ కర్ణిసింగ్‌ అంతర్జాతీయ షూటింగ్‌ రేంజ్‌లో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ రైఫిల్‌ షూటింగ్‌ జట్టు ఎంపికలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని, పీప్‌ సైట్‌ 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి జట్టులో స్థానం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడలోని ది ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ రేంజ్‌లో కోచ్‌ ఎన్‌.సుబ్రహ్మణ్యేశ్వరరావు పర్యవేక్షణలో అతను సాధన చేస్తున్నాడని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని