రెండోరోజూ విక్రయాల జోరు
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

రెండోరోజూ విక్రయాల జోరు


మిర్చియార్డులో క్రయవిక్రయాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: వరుసగా రెండో రోజూ గుంటూరు మిర్చియార్డుకు భారీగా బస్తాలు వచ్చాయి. క్రయవిక్రయాలు అదే స్థాయిలో జరిగాయి. గురువారం రైతులు మొత్తం 72,549 మిర్చి బస్తాలను యార్డుకు తరలించారు. ఈ-నామ్‌ పద్ధతిలో 72,198 విక్రయాలు జరిగాయి. లావాదేవీలు ముగిసే సమయానికి యార్డులో 20,661 బస్తాలు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం పెట్టుబడులు సమయం కావడంతో రైతులు అమ్మకాలకు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు అంటున్నారు. గుంటూరు యార్డు పరిధిలో శీతలగిడ్డంగుల కంటే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌ల నుంచి అధికంగా సరకు వస్తుందంటున్నారు. కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.12,600 వరకు, తేజ రూ.7,000 నుంచి రూ.14,400, బాడిగ రూ.8,000 నుంచి రూ.16,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,500 ధర లభించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని