విజయవంతంగా 600 కి.మీ. రాండోనియరింగ్‌
eenadu telugu news
Published : 26/10/2021 04:32 IST

విజయవంతంగా 600 కి.మీ. రాండోనియరింగ్‌


ఈవెంట్‌ను పూర్తిచేసిన భాస్కర్‌గౌడ్‌, జగదీష్‌బాబు, వాలంటీర్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: వన్‌ వీక్‌(ఒక వారం) సూపర్‌ రాండోనియర్స్‌ ఈవెంట్‌లో భాగంగా ఈనెల 23న నగరం నుంచి ప్రారంభమైన 600కి.మీ. రాండోనియరింగ్‌ను నగరానికి చెందిన భాస్కర్‌ గౌడ్‌ సుధాగని, డి.జగదీష్‌బాబు నిర్దేశించిన సమయం(40 గంటలు)లో 24వ తేదీ రాత్రి 11 గంటల్లోపు పూర్తి చేశారని విజయవాడ రాండోనియర్‌ క్లబ్‌ ప్రతినిధి డి.జగదీష్‌బాబు తెలిపారు. వన్‌ వీక్‌ సూపర్‌ రాండోనియర్స్‌లో అయిదుగురు రాండోనియర్స్‌ పేర్లు నమోదు చేసుకోగా.. నిర్దేశించిన సమయంలో ఇద్దరు మాత్రమే పూర్తి చేశారన్నారు. వీరితో పాటు సూపర్‌ రాండోనియర్‌(200కి.మీ., 300కి.మీ., 400కి.మీ., 600కి.మీ. పూర్తి చేసినవారు) ఈవెంట్‌లో భాగంగా చివరి ఈవెంట్‌ 600కి.మీ. పోటీలో గుంటూరుకు చెందిన అనిల్‌కుమార్‌ మేదరమెట్ల, పవన్‌కుమార్‌, శ్రీకాంత్‌ కోగంటి, హైదరాబాద్‌కు చెందిన భవాని సూర్యనారాయణన్‌, ప్రసాద్‌ వల్లభజోస్యుల, గణేశ్వరరావు జాష్టి, ప్రవీణ్‌ కూచిపూడిలు నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేసి సూపర్‌ రాండోనియర్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. సైకిల్‌ పోటీలను కష్టతరం చేసేందుకు ఒక వారం రోజుల వ్యవధిలో సూపర్‌ రాండోనియర్‌లో భాగంగా ఈ నెల 23న 600కి.మీ. ఈవెంట్‌ నిర్వహించామని, ఈనెల 26న 200కి.మీ.(13.30 గంటల్లోపు), 27న 400కి.మీ (27 గంటలు), 29న 300కి.మీ.(20 గంటలు) ఈవెంట్స్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ నాలుగు ఈవెంట్లలో ఏ ఒక్క ఈవెంట్‌ను నిర్ణీత సమయంలోపు పూర్తి చేసిన వారికి పారిస్‌ నుంచి యునిక్‌ నంబరు, పతకం అందుతాయని ఆయన పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని