సచివాలయ సిబ్బందిపై వైకాపా నాయకుల దౌర్జన్యం
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

సచివాలయ సిబ్బందిపై వైకాపా నాయకుల దౌర్జన్యం

కొల్లిపర, న్యూస్‌టుడే: తమతో సంప్రదించకుండా ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌) ధ్రుపపత్రాలకు సిఫార్సు చేయడమేమిటంటూ ఇద్దరు వైకాపా నాయకులు మండలంలోని పిడపర్రు గ్రామ సచివాలయ సిబ్బందిపై మంగళవారం దౌర్జన్యం చేశారు. పిడపర్తిపాలేనికి చెందిన ఇరువురు ఈ ధ్రువపత్రాల కోసం అర్జీలు పెట్టుకోగా, సచివాలయ సిబ్బంది పరిశీలనలో ఒకరికి అర్హతున్నట్టు గుర్తించి, ఆ వ్యక్తికి ధ్రుపపత్రం ఇవ్వొచ్చంటూ తహసీల్దారు కార్యాలయానికి ఆయన అర్జీని ‘ఫార్వర్డు’ చేశారు. మరొకరి అర్హతను నిర్ణయించాలంటూ వారు సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలు సేకరించి మండల రెవెన్యూ కార్యాలయానికి పంపారు. విషయం తెలుసుకున్న పిడపర్తిపాలేనికి చెందిన ఈ నాయకులు తమతో సంప్రదించకుండా రెవెన్యూ కార్యాలయానికి సిఫార్సు పంపడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తూ తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, విషయాన్ని తాము మండలాధికారులకు తెలియజేశామని సచివాలయ సిబ్బంది చెప్పారు. ఈ దాడి విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని ఎస్సై బలరామిరెడ్డి ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని