Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రికెట్‌ కిట్‌లు స్వాధీనం

పోలీసులు గుర్తించిన కిట్లు ఇవే..

తాడిపత్రి గ్రామీణం, న్యూస్‌టుడే: తాడిపత్రి పట్టణంలో గురువారం రాత్రి పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టి క్రికెట్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు క్రికెట్‌ కిట్లను పంచేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు స్థానిక బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లో తనిఖీ చేశారు. అక్కడ ఉన్న 60 క్రికెట్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల కిందట జేసీ కుటుంబం ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. అందులో పాల్గొన్న జట్లకు క్రికెట్‌ కిట్లను అందజేశారు. అందులో మిగిలిన 60 కిట్లు అప్పటి నుంచి అలాగే ఉన్నాయని జేసీ అనుచరులు చెబుతున్నారు. ఆ కిట్లకు సంబందించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని