Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోవారంలోరెండు వేల కేసులకు అవకాశం

నోడల్‌ అధికారి రామగోపాల్‌

తిరుపతి(రెవెన్యూ), న్యూస్‌టుడే: ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. తిరుపతిలో మరోవారంలో రెండు వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కొవిడ్‌ నియంత్రణ నోడల్‌ అధికారి రామగోపాల్‌ తెలిపారు. నగరంలోని ప్రధాన మార్కెట్‌లలో రద్దీ లేకుండా మరిన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం జిల్లా పాలనాధికారి హరినారాయణన్‌తో కొవిడ్‌ నియంత్రణపై సమీక్షించారు. ప్రదర్శన ద్వారా గత సంవత్సరం నుంచి నమోదు అయిన కేసులు, తీసుకున్న చర్యలను కలెక్టర్‌ వివరించారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో తిరుపతిలో పద్మావతీ నిలయం, విష్ణునివాసంలో మైల్డ్‌ కేసుల వారు ఉన్నారని, మరో వారంలో శ్రీనివాసం, ఈఎస్‌ఐ, ఆయుర్వేద ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. జిల్లాలో మరికొన్ని చోట్ల చిన్నచిన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వేగవంతంగా విస్తరిస్తున్న కొవిడ్‌కి చెక్‌ పెట్టడానికి కృషి చేయాలని రామగోపాల్‌ పిలుపునిచ్చారు. సమీక్షలో జేసీ వీరబ్రహ్మం, జేసీ-2 రాజశేఖర్‌, నోడల్‌ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని