నేడు ఆర్టీసీ డిపో ప్రారంభం
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడు ఆర్టీసీ డిపో ప్రారంభం


ఆర్టీసీ అధికారులతో చర్చిస్తున్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరు: స్థానిక ఆర్టీసీ డిపోను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి నుంచి వర్చువల్‌ విధానం ద్వారా గురువారం ప్రారంభిస్తారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అన్నారు. బుధవారం డిపో ఆవరణలో సాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో చర్చించారు. సీఎం, మంత్రి అమరావతి నుంచే ప్రారంభిస్తారని, స్థానికంగా నిర్వహించే కార్యక్రమంలో రాజంపేట ఎంపీ, లోక్‌సభ ప్యానల్‌ స్పీకరు పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఆర్టీసీ, జిల్లా, స్థానిక అధికారులు పాల్గొంటారన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అతితక్కువ మంది పాల్గొంటున్నారన్నారు. అలాగే మండలంలోని రాంపల్లె వద్ద లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్మించిన డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్‌ అలీంబాషా, ఏఎంసీ ఛైర్మన్‌ నాగరాజరెడ్డి, పురపాలక మాజీ ఛైర్మన్‌ నాగభూషణం, నాయకులు వెంకటరెడ్డియాదవ్‌, జయరామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, చంద్రారెడ్డియాదవ్‌, డీఎం సుధాకరయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని