చాకీ పట్టు పురుగుల సరఫరాకు చర్యలు
logo
Published : 18/06/2021 04:21 IST

చాకీ పట్టు పురుగుల సరఫరాకు చర్యలు


చాకీ పట్టు పురుగులను పరిశీలిస్తున్న జేడీ శోభారాణి

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే : జిల్లాలోని పట్టు రైతులందరికీ జిల్లా నుంచే చాకీ పట్టు పురుగుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని పట్టు పరిశ్రమ శాఖ జేడీ శోభారాణి పేర్కొన్నారు. గురువారం స్థానిక చిత్తూరు నగర సమీపం కొత్తూరులో కొత్తగా మంజూరు చేసిన చాకీ పట్టు పురుగుల కేంద్రాన్ని పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా పట్టు రైతులు చాకీ పురుగులను కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారని, తద్వారా పెట్టుబడులు పెరిగి ఆర్థిక భారమవుతోందని చెప్పారు. దీనిని నివారించేందుకు కేంద్ర సిల్క్‌ బోర్డు ఆర్థిక సహకారంతో జిల్లాలో కొత్తగా రెండు చాకీ పురుగుల పెంపక కేంద్రాలను నెలకొల్పుతున్నామని వీటిని నెల రోజుల్లో ప్రారంభించనున్నామని చెప్పారు. జిల్లా పట్టు రైతులకు ప్రతి ఐదు రోజులకు చాకీ పురుగుల సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నాణ్యమైన చాకీ పురుగుల సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, రైతులకు సూచించారు. పట్టు పరిశ్రమ శాఖ ఏడీ బాబు, కేంద్ర సిల్క్‌ బోర్డు సాంకేతిక అధికారి గోపాల్‌, చాకీ కేంద్రం నిర్వాహకుడు హేమంత్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని