శిరస్త్రాణం వినియోగంపై అవగాహన కల్పించండి: ఎస్పీ
eenadu telugu news
Published : 01/08/2021 03:47 IST

శిరస్త్రాణం వినియోగంపై అవగాహన కల్పించండి: ఎస్పీ

మాట్లాడుతున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించడానికి అందరూ కృషి చేయాలని, శిరస్త్రాణంపై అవగాహన కల్పించాలని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశించారు. చిత్తూరు లోని పోలీసు అతిథి గృహంలో శనివారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. చాలా మంది వాహన చోదకులు పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకోవాలని నాసిరకం శిరస్త్రాణం ధరించి ప్రమాదా లకు గురై క్షతగాత్రులవడమే కాక మృత్యువాత పడుతున్నారన్నారు. ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన శిరస్త్రాణం వినయోగించాలని, అన్ని స్టేషన్‌ల పరిధిలో రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. నాణ్యమైన శిరస్త్రాణం కొనుగోలుపై అవగాహన కల్పించాలన్నారు.జిల్లాలో 101 చెక్‌పోస్టులు ఉన్నాయని, 10 మొబైల్‌ పార్టీల గస్తీ ఉందన్నారు. ఈ మొబైల్‌ పార్టీ బృందం నిత్యం రహదారుల్లో నిఘా ఉంచాలని, చెక్‌పోస్టుల్లో అధికారులు, సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇసుక, మద్యం అక్రమ రవాణా జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రస్తుతం 18 మంది పీఎస్సైలకు శిక్షణ ఇచ్చి పోస్టింగ్‌ ఇచ్చామని, అందరూ నిజాయతీగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం మదనపల్లె, పుత్తూరు సబ్‌డివిజన్‌లలో పెండింగ్‌ కేసులపై సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. ఏఎస్పీ మహేష్‌, ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌నాయుడు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని