పాలిసెట్‌లో 93.21 శాతం ఉత్తీర్ణత
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

పాలిసెట్‌లో 93.21 శాతం ఉత్తీర్ణత

జిల్లాకు పదో స్థానం


వసంత్‌కుమార్‌ , కృష్ణ జ్ఞానదీప్‌ , మేఘన

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 4,487 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 1న జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 4,021 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,557 మంది బాలురు, 1,191 మంది బాలికలు మొత్తం 3,748(93.21 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదిలానే ఈ ఏడాది జిల్లాకు పదో స్థానం దక్కింది.

టాపర్లు వీరే..: ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. 115 మార్కులతో సి.వసంత్‌కుమార్‌ 103వ ర్యాంకు, 115 మార్కులతో ఎ.కృష్ణ జ్ఞానదీప్‌ 113వ ర్యాంకు, 113 మార్కులతో సి.మేఘన 206వ ర్యాంకు లు సాధించారు. ఎస్వీయూ రీజనల్‌ పరిధిలో బాలుర విభాగంలో 119 మార్కులతో సి.కార్తిక్‌, వై.హేమంత్‌ 3వ ర్యాంకు, 118 మార్కులతో సి.వంశీకృష్ణ 14, బాలికల విభాగంలో 119 మార్కులతో వి.జోత్స్న 12, 116 మార్కులతో బి.రిత్విక 81, 116 మార్కులతో బి.లక్ష్మీగ్రీష్మ 90వ ర్యాంకు సాధించారు.

స్పేస్‌ ఇంజినీరింగ్‌ లక్ష్యం.. పాలిటెక్నిక్‌లో సీఎస్సీ తీసుకుని బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో చేరి స్పేస్‌ ఇంజినీరింగ్‌ చేయాలనేది లక్ష్యం అంటున్నాడు.. తిరుపతికి చెందిన ఎ.కృష్ణజ్ఞానదీప్‌. తండ్రి హరీష్‌కుమార్‌ తిరుపతిలో ఓ ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి చూడామణి గృహిణి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని