Published : 27/07/2021 06:01 IST

స్పందనకు వినతుల వెల్లువ


అర్జీదారు నుంచి వివరాలు సేకరిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌, జేసీ లక్ష్మీశ

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎట్టకేలకు జిల్లా స్థాయి స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికలు, కొవిడ్‌తో నిలిచిపోయిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను పునరుద్ధరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వివేకానంద మందిరంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ (రెవెన్యూ) జి.లక్ష్మీశ, సయుక్త కలెక్టర్లు జి.రాజకుమారి, భార్గవ్‌తేజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, డీఆర్వో సత్తిబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. వివిధ సమస్యలపై 189 మంది వినతిపత్రాలు అందజేశారు. వీటిని స్వీకరించిన అధికారులు సంబంధిత శాఖల అధికారులతో అక్కడి నుంచే సమీక్షించారు. సత్వరమే పరిష్కరించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఆదేశించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న 1,962 అర్జీలను త్వరగా పరిష్కరించి, సంబంధిత వ్యక్తులకు సమాచారం అందించాలని ఆదేశించారు. మండల, డివిజన్‌ స్థాయిలోనూ స్పందన పునరుద్ధరించారన్నారు. సచివాలయ స్థాయిలోనే అనేక సమస్యలను పరిష్కరిస్తున్నారని, దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని