ప్రజాపంపిణీ వ్యవస్థ భేష్‌
eenadu telugu news
Published : 27/07/2021 06:01 IST

ప్రజాపంపిణీ వ్యవస్థ భేష్‌

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రెండ్రోజులపాటు పర్యటించింది. సోమవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి కలెక్టర్‌, జేసీ లక్ష్మీశ, అధికారులతో ఈ బృందం భేటీ అయ్యింది. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందని బృంద సభ్యులు కె.గిరిజాశంకర్‌, రవిపారిక్‌, నాగేశ్వరరావు తెలిపారు. మండల స్థాయి సరకు నిల్వ కేంద్రాలు, చౌక దుకాణాలను పరిశీలించామని, లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించామని, అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, డీఎస్‌వో ప్రసాదరావు, డీఎం లక్ష్మీరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ మయూరి, ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని