అమ్మే.. నాన్నను చంపింది!
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

అమ్మే.. నాన్నను చంపింది!

హైదరాబాద్‌: భర్తను హత్యచేసి గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించగా.. ఆమె కుమారుడు వాస్తవం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన జగదీష్‌(43) 2007లో ఓ యువతిని పెళ్లి చేసుకోగా.. వారికి కుమారుడు(11) ఉన్నారు. జగదీష్‌.. ఫిలింనగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. జగదీష్‌ డ్రైవరుగా పనిచేస్తుండగా.. ఆమె సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తోంది. జులై 15న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె.. తన మరిది రాజేష్‌కు ఫోన్‌ చేసి జగదీష్‌ గుండెపోటుతో మృతి చెందాడని చెప్పింది. దీంతో జులై 16న కాకినాడకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈనెల 9న రాజేష్‌ ఇంటికి వచ్చిన జగదీష్‌ కుమారుడు.. ‘అమ్మే.. నాన్న మెడకు చున్నీ చుట్టి చంపడానికి ప్రయత్నించిందని’ బాబాయికి చెప్పాడు. దీంతో జగదీష్‌ సోదరుడు మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని