అకటా.. వార్డు కిటకిట
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

అకటా.. వార్డు కిటకిట

జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న వీరంతా కాకినాడ జీజీహెచ్‌లోని ఆరో వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ 25 పడకలుండగా 48 మంది చికిత్స పొందుతున్నారు. ఒకే మంచంపై ఇద్దేరేసి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. సమస్యను డీఎంహెచ్‌వో గౌరీశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా.. ఈ సీజన్‌లో ఇప్పటికి 290 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాలనుగుణ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశామని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. -ఈనాడు, కాకినాడ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని