ఏపీ టెక్నికల్‌ ఆఫీసర్స్‌ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

ఏపీ టెక్నికల్‌ ఆఫీసర్స్‌ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ

 

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ టెక్నికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌.సత్యనారాయణ ఎన్నికయ్యారు. ర.భ. కాకినాడ సర్కిల్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను రాజమహేంద్రవరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు కేవీ రత్నవరహాలరాజు ఉద్యోగ విరమణ చేయడంతో ఈయన్ని కో-ఆప్షన్‌ చేశారు. ర.భ., పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో విధులు నిర్వర్తించే ఈ విభాగానికి చెందిన వారంతా సభ్యులుగా ఉన్నారు. నూతన అధ్యక్షుడ్ని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.ఏడుకొండలు, ఉపాధ్యక్షులు టి.దొరబాబు, శేషగిరి, సంయుక్త కార్యదర్శులు ఏవీఎన్‌ నరసింహం, హెచ్‌.హేమంతరావు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని