మహాకాళేశ్వరాలయంలో ద్వీపస్తూపం స్థాపన నేడు
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

మహాకాళేశ్వరాలయంలో ద్వీపస్తూపం స్థాపన నేడు

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గౌతమఘాట్‌ వద్ద ఇన్నీస్‌పేట కైలాసభూమి పక్కన నిర్మిస్తున్న మహాకాళేశ్వరాలయంలో శుక్రవారం ద్వీప స్తూపం స్థాపన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు పట్టపగలు వెంకటరావు, తోట సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, నవగ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలకు సూచికగా 108 ద్వీపాలతో కూడిన స్తంభాలను స్థాపించదలిచామన్నారు. ఇందులో భాగంగా విజయదశమి శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు 12 కోట్ల ఓం నమశ్శివాయ నామాలు రాసిన పుస్తకాలను నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు. సరస్వతీఘాట్‌ నుంచి 108 మంది తలపై కలశాలతో, శివనామాలు రాసిన పత్రాలతో ఊరేగింపుగా మహాకాళేశ్వరాలయానికి చేరుకుంటారని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దర్శించుకోవాలని ఆహ్వానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని