గోదావరి పాయపై ప్రైవేట్‌ వంతెన
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

గోదావరి పాయపై ప్రైవేట్‌ వంతెన


నిర్మాణ పనులు

 

తాళ్లరేవు: ఆత్రేయ గోదావరి పాయ మీదుగా ఆక్వా చెరువులకు మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. స్థానిక బందరు కళాశాలకు చెందిన భూమిని కొంతమంది లీజుకు తీసుకుని ఆక్వా సాగు చేస్తున్నారు. ఆ చెరువులకు రాకపోకలు సాగించేందుకు ఇప్పటికే ఆత్రేయ గోదావరి పాయకు ఇరు వైపులా సిమెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే 500 మీటర్ల దూరంలో ప్రభుత్వ నిధులతో వంతెన నిర్మించారు. ఆ పరిధిలో మరో వంతెన నిర్మించకూడదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని హెడ్‌వర్క్స్‌ కోటిపల్లి సెక్షన్‌ జేఈ సుబ్బారావు వద్ద ప్రస్తావించగా ఆత్రేయ గోదావరిపై వంతెన నిర్మాణ పనులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని