కస్తూర్బా విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

కస్తూర్బా విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలోని 12 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ, డీఈవో ఎస్‌.అబ్రహం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 105, ఏడులో 68, ఎనిమిదిలో 45, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 54 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా విద్యాలయాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి, 22వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని