వైకాపా... దీక్షాపథం
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

వైకాపా... దీక్షాపథం


రామచంద్రపురం: దీక్షలో మంత్రి వేణు, తదితరులు

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా అధినాయకత్వం పిలుపు మేరకు గురువారం జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు జనాగ్రహ దీక్షలు ప్రారంభించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా తెదేపా వ్యవహరిస్తోందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు విమర్శించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన దీక్షల్లో మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపిన సీఎంపై అనుచిత వ్యాఖ్యలు తగవని వారు పేర్కొన్నారు.

●●కాకినాడ గ్రామీణంలో సర్పవరం జంక్షన్‌ వద్ద మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ●●● రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

●●ముమ్మిడివరంలో ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు. ●●● తునిలో ఎమ్మెల్యే, విప్‌ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

●●రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కాకినాడ నగరంలో కుడా ఛైర్‌పర్సన్‌ చంద్రకళాదీప్తి, కాకినాడ స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌ అల్లి రాజుబాబు, వైకాపా కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ●●● పి.గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే పర్వత, రంపచోడవరంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి, పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అనపర్తిలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పెద్దాపురంలో వైకాపా బాధ్యుడు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ●●● రాజమహేంద్రవరంలో మోరంపూడి జంక్షన్‌ వద్ద దీక్షలో ఎంపీ భరత్‌, రాజమహేంద్రవరం స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌ చందన నాగేశ్వరరావు.. కోటగుమ్మం సెంటర్‌ వద్ద మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ●●● కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో, జగ్గంపేటలో వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.

కాకినాడ గ్రామీణం: ప్రసంగిస్తున్న మంత్రి కన్నబాబు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని