పోలీసు అమరవీరుల కుటుంబాలకు పరామర్శ
eenadu telugu news
Published : 23/10/2021 02:17 IST

పోలీసు అమరవీరుల కుటుంబాలకు పరామర్శ


సమస్య వింటున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరులైన పోలీసుల ఇళ్లకు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు స్వయంగా వెళ్లి పరామర్శించారు. శుక్రవారం గైగోలుపాడులోని ఎస్సై సీహెచ్‌ దేవకీరావు, వాకలపూడిని ఏఆర్‌ కానిస్టేబుల్‌ దుర్గాప్రసాద్‌ ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అమరులైన ఇద్దరి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. మనందరం పోలీస్‌ కుటుంబమని, అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట అదనపు ఎస్పీ కరణం కుమార్‌, ఎస్‌బీ డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, ఎం.వెంకటేశ్వరరావు, కాకినాడ డీఎస్పీ వి.భీమారావు, ఐటీకోర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రామచంద్రరావు, ఆర్‌ఐ(వెల్ఫేర్‌) వెంకటఅప్పారావు ఉన్నారు. అన్ని సబ్‌డివిజన్ల పరిధిలో అమరులైన పోలీసుల కుటుంబాలను డీఎస్పీలు వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

జిల్లాలో పోలీసు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని ఎస్పీ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రతి నెలా మూడో శుక్రవారం పోలీసుల సంక్షేమ దివస్‌ను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆయన చర్యలు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని