జవహర్‌ నవోదయలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
eenadu telugu news
Published : 16/09/2021 01:56 IST

జవహర్‌ నవోదయలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: 2022-23 విద్యా సంవత్సరానికి మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయలో 9వ తరగతిలో ఖాళీల భర్తీకి అక్టోబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహరావు బుధవారం తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో 8వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. 1-5-2006 నుంచి 30-04-2018 మధ్యలో జన్మించి ఉండాలన్నారు. అర్హులైన విద్యార్థులు జేఎన్‌వీ విద్యాలయ వెబ్‌సైట్‌ ద్వారా అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 2022 ఏప్రిల్‌ 9 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని