బలుసులపాలెం యువకునికి అవార్డు
eenadu telugu news
Published : 18/09/2021 05:00 IST

బలుసులపాలెం యువకునికి అవార్డు


పురస్కారం అందుకొంటున్న రవికిరణ్‌ గౌడ్‌

బలుసులపాలెం(చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే : ఉద్యాన పంటల సాగు అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు చెరుకుపల్లి మండలం బలుసులపాలెం గ్రామానికి చెందిన యువకుడు కొనకాల రవికిరణ్‌గౌడ్‌ ప్రతిష్ఠాత్మక ’రామనందనబాబు అవార్డు’ అందుకొన్నాడు. ఆయన ‘కన్సడరేషన్‌ హార్టికల్చరల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ సభ్యునిగా పనిచేస్తున్నారు. ఈ అసోసియేషన్‌లో దేశవ్యాప్తంగా 28 మంది ఉండగా, ఏపీ నుంచి రవికిరణ్‌ ఒక్కరే 2015లో నామినేట్‌ అయ్యారు. సాధారణ, ఉద్యాన పంటల అభివృద్ధికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అసోసియేషన్‌ సభ్యులు పర్యటించారు. కొబ్బరి, మామిడి తోటల సాగు అభివృద్ధికి కృషి చేసినందుకు గుర్తింపుగా 2020-21 సంవత్సరానికి ఈ అవార్డు రవికిరణ్‌గౌడ్‌ను వరించింది. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించిన ‘భారతదేశ వ్యవసాయ ఉద్యాన శాఖ సదస్సు’లో ప్రపంచ ప్రఖ్యాత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ హరిశ్చంద్రప్రసాద్‌సింగ్‌, విశ్రాంత వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభన్‌ పట్నాయక్‌ చేతులమీదుగా గురువారం రాత్రి ఆయన అవార్డు అందుకున్నారు. అవార్డును తన తల్లిదండ్రులు కొనకాల నాగమల్లేశ్వరి, సీతారామయ్యకు అంకితమిస్తున్నట్లు శుక్రవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని