వారు ఓటు హక్కు వినియోగించుకోలేదాయె!
eenadu telugu news
Published : 20/09/2021 02:59 IST

వారు ఓటు హక్కు వినియోగించుకోలేదాయె!

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘంతో పాటు ఉన్నతాధికారులు, ఉద్యోగులు సాధారణ ప్రజలను చైతన్యపర్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు ఈసీ అవకాశం కల్పించింది. ఆదివారం గుంటూరు ఆంధ్రా లూథరన్‌ బీఈడీ కళాశాలలో మేడికొండూరు జడ్పీటీసీ స్థానంకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించేందుకు బాక్సును తెరిచారు. ఒక్క ఓటూ లేకపోవడంతో అధికారులు, సిబ్బందితో పాటు పోటీ చేసిన అభ్యర్థులను విస్మయానికి గురి చేసేలా ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును వినియోగించుకోకపోవడం విస్మయానికి గురి చేసింది. ఎన్నికల సమయంలో ఓ ప్రమాదంలో గాయపడడంతో ఉద్యోగులను కలిసి ఓటు వేయాలని కోరలేదని.. అయినా ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం బాధాకరమని ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎంపీటీసీ స్థానం పరిధిలో పోలైన ఓట్లకు బ్యాలెట్‌ బాక్సులు తెరచిన తర్వాత ఒక ఓటు తేడా ఉండడంతో అభ్యర్థులు సిబ్బందిని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని