గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: చిలకలూరిపేట పట్టణంలో శారదా హైస్కూల్‌ బాజారులోని రావమ్మ గుడి బజారులోని ఒక ఇంట్లో వంటగ్యాస్‌ లీకై శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాయుడుభవానీ అనే మహిళ ఇంట్లో పండగ సందర్భంగా గ్యాస్‌ పొయ్యి మీద పిండి వంటలు చేస్తోంది. ప్రమాదవశాత్తు గ్యాస్‌ పైపు లీకేజీతో మంటలు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన భవానీ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. మంటలు ఇల్లు మొత్తం వ్యాపించడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్‌ తదితర గృహోపకరణాలు కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో భవానీ కాళ్లకు, చేతులకు స్వల్పగాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని