‘ఫీజు చెల్లించలేదని విద్యార్థిని బయట కూర్చోబెట్టారు’
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

‘ఫీజు చెల్లించలేదని విద్యార్థిని బయట కూర్చోబెట్టారు’

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఫిరంగిపురానికి చెందిన ఓ పాఠశాల విద్యార్థిని ఫీజు చెల్లించలేదని బయట కూర్చోబెట్టారని ఈ విషయం విచారణలలో తేలిందని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్వవేక్షణ కమిషన్‌ సభ్యులు వెంబులూరి నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్‌ మంగళవారం సాయంత్రం తెలిపారు. హౌస్‌గణేష్‌ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఫీజు చెల్లించలేదనే కారణంతో ఆరుబయట కూర్చోబెట్టారని ఒక వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీనిపై విచారణ నిమిత్తం కమిషన్‌ సభ్యులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు వచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని