close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

తాజా వార్తలు

కాశీం కస్టడీ పిటిషన్‌ కొట్టివేత

గజ్వేల్‌, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: విరసం కార్యదర్శి, ప్రొఫెసర్‌ కాశీంను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని జిల్లా పోలీసులు సమర్పించిన పిటిషన్‌ను గజ్వేల్‌ న్యాయస్థానం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ నెల 18వ తేదీన గజ్వేల్‌ పోలీసులు కాశీంను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇతర సమాచారం తీసుకునేందుకు ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని గజ్వేల్‌ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కాశీం తరఫున న్యాయవాదులు 21వ తేదీన కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే గజ్వేల్‌ న్యాయస్థానంలో శుక్రవారం రాత్రి వరకు సుదీర్ఘంగా వాదోపవాదనలు జరిగాయి. విన్న అనంతరం కస్టడీకి నిరాకరిస్తూ న్యాయస్థానం పోలీసుల పిటిషన్‌ను కొట్టివేసింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.