Updated : 05/12/2020 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

6వ ఉత్తమ ఆస్పత్రిగా బసవతారకం: బాలకృష్ణ

హైదరాబాద్‌: వ్యవస్థను నెలకొల్పడం కన్నా.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయమని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. బసవతారకం ఆస్పత్రికి దేశంలోనే 6వ ఉత్తమ క్యాన్సర్‌ ఆస్పత్రిగా అవార్డు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా బసవతారకాన్ని తీర్చిదిద్దుతామన్నారు. సేవా సంకల్పంతో నడుస్తున్న తమ ఆస్పత్రికి అవార్డులు రావడాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించడంగా భావిస్తానని బాలకృష్ణ అన్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ సోకిన 3,200 మంది క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించామని అన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని