
రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ ఉద్యోగి మృతి
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బ్యాంకు డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ దుర్మరణం పాలయ్యారు. ఇవాళ ఉదయం రహదారిపై వెళుతున్న ఇస్నాపూర్ శాఖ ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి ప్రతాప్‌ను వెనకవైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ముందు వస్తున్న బస్సు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
Tags :