‘పేదలకు ఉచితంగా చికిత్స చేయాలి’
logo
Published : 19/06/2021 01:38 IST

‘పేదలకు ఉచితంగా చికిత్స చేయాలి’

విద్యానగర్‌, న్యూస్‌టుడే: పేదలకు ఉచితంగా కరోనా చికిత్స అందించేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రైవేట్‌ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. నల్లకుంట డివిజన్‌ ఓయూ రోడ్డులోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో సేవా భారతి, సక్షమ్‌ సంస్థలు కొవిడ్‌ బారిన పడిన పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో దశలో పిల్లలకు మహమ్మారి సోకుతుందని ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రి ఛైర్మన్‌ ఎస్‌.వి.రావు, సేవా భారతి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారెడ్డి, ట్రస్టు అధ్యక్షురాలు ఉషారెడ్డి, భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు, కార్పొరేటర్‌ అమృత పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని