చెరువులో పడి బాలుడు..
logo
Published : 19/06/2021 02:04 IST

చెరువులో పడి బాలుడు..

వినయ్‌కుమార్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: చేపల వేటకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల కథనం ప్రకారం.. జాఫర్‌గూడ గ్రామ పంచాయతీ పరిధి జయశంకర్‌ కాలనీకి చెందిన సంజీవ్‌కుమార్‌ కుమారుడు వినయ్‌కుమార్‌ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతను సమీపంలోని జాఫర్‌గూడ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లినట్లు గుర్తించి చెరువులో గాలింపు చేపట్టగా శుక్రవారం వినయ్‌కుమార్‌(14) మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని