ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

రెండు నెలల క్రితమే తల్లిదండ్రులు, సోదరుడు కరోనాతో మృతి


రాజు

ఉప్పల్‌, న్యూస్‌టుడే: కనిపెంచిన తల్లిదండ్రులు.. ఆపదలో ఆదుకునే సోదరుడిని రెండు నెలల క్రితమే కరోనా మింగేసింది. జీవితకాలం తోడు ఉంటారనుకున్న భార్య విడాకులిచ్చింది. ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌లో నివసించే డిండిగాల రాజు(46) ఏసీ మెకానిక్‌. రెండు నెలల క్రితం రాజు తల్లిదండ్రులు పార్వతమ్మ, సోమయ్య, సోదరుడు నర్సింగరావు పది రోజుల వ్యవధిలో ముగ్గురు కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. అంతకంటే ముందు కట్టుకున్న భార్య రాజుకు విడాకులిచ్చింది. ఆలి దూరమైనప్పటికీ కనిపెంచిన తల్లిదండ్రులతోనే ఉండేవారు. మరో సోదరుడు శంకర్‌ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నారు. దీంతో రాజు తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశకు గురయ్యారు. సోమవారం ఉదయం బాత్‌రూంలోకి వెళ్లి కిరోసిన్‌ మీద పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సోదరుడు శంకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని