తిండి గింజలపై పేదోడి పేరు
eenadu telugu news
Published : 27/07/2021 02:49 IST

తిండి గింజలపై పేదోడి పేరు

కొత్త రేషన్‌ కార్డుల జారీ షురూ


పీర్జాదిగూడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద రేషన్‌కార్డు మంజూరు పత్రాల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న కొత్త రేషను కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కార్డులను అందించే కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి లబ్ధిదారులకు మండల కేంద్రాల్లో ధ్రువీకరణపత్రాలు అందజేశారు. కొత్త రేషను కార్డులకు మూడు జిల్లాల్లో 15లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఏళ్ల తరబడిగా పెండింగులో ఉన్న దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చిన దరఖాస్తులపై అధికారులు పరిశీలన చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి సోమవారం నుంచి అర్హత ధ్రువీకరణపత్రాలు అందించారు. మూడు జిల్లాల్లో 1.46లక్షల మంది లబ్ధిదారులుగా గుర్తించి వాటిని అందించడం ప్రారంభించారు. తొలిరోజున 74,300 మందికి ధ్రువీకరణపత్రాలు అందించారు. మరో రెండు రోజులు పంపిణీ కొనసాగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని