సైబర్‌ మోసం.. విశ్రాంత న్యాయమూర్తి డబ్బులు స్వాహా
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

సైబర్‌ మోసం.. విశ్రాంత న్యాయమూర్తి డబ్బులు స్వాహా

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బంజారాహిల్స్‌ అరోరా కాలనీలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వాడ రాజగోపాలరెడ్డి(84) నివసిస్తుంటారు. ఈ నెల 25న విద్యుత్తు బిల్లు చెల్లింపులో సమస్యలతో సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన చరవాణికి ఒక సంక్షిప్త సందేశం వచ్చింది. గమనించిన ఆయన ఆ నంబరుకు ఫోన్‌ చేయగా అవతలి వ్యక్తి తాను విద్యుత్తు శాఖ అధికారినని నమ్మించారు. తాను బిల్లులన్నీ చెల్లించానని చెప్పగా అవి అప్‌డేట్‌ కాలేదని తాను పరిష్కరిస్తానని సైబర్‌ మోసగాడు నమ్మించాడు. కంప్యూటర్లో టీం వ్యూయర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించి డెబిట్‌ కార్డు వివరాలు సేకరించాడు. ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.45,931 తస్కరించాడు. ఈ మేరకు న్యాయమూర్తి ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని