ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

మరో ఇద్దరికి గాయాలు


ఆనందం మృతదేహాం

ధారూర్‌: ఎదురెదుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మోమిన్‌కలాన్‌ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. అంతారంవాసి లక్నాపూర్‌ ఆనందం(30), మోమిన్‌కలాన్‌కు చెందిన ప్రవీణ్‌ స్నేహితులు. వీరిద్దరూ శనివారం ద్విచక్రవాహనంపై అంతారం వైపు వస్తున్నారు. అదే సమయంలో మోమిన్‌కలాన్‌కు చెందిన కరీమోద్దీన్‌ ద్విచక్ర వాహనంపై వికారాబాద్‌ నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఆనందం అక్కడికక్కడే మృతి చెందాడు. కరీమోద్దీన్‌, ప్రవీణ్‌లకు స్వల్ప గాయాలయ్యయి. ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. ఆనందానికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని