ప్లాస్టిక్‌ గోదాములో అగ్ని ప్రమాదం
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

ప్లాస్టిక్‌ గోదాములో అగ్ని ప్రమాదం

నాగోలు, న్యూస్‌టుడే: కర్మన్‌ఘాట్‌లోని కేకే గార్డెన్స్‌ సమీపంలో భూపేష్‌గుప్తా నగర్‌కు చెందిన బాలెముల జగపతిరెడ్డికి పాత ప్లాస్టిక్‌ సామాన్ల గోదాము ఉంది. ఆదివారం మధ్యాహ్నం గోదాములో మంటలు రేగాయి. వాచ్‌మన్‌ సమాచారం మేరకు యజమాని అక్కడికి చేరుకునే లోపే సామగ్రితోపాటు, బస్సు, రెండు ఆటోలు కాలిపోయాయి. ఎల్బీనగర్‌ పోలీసులు చేరుకొని మరో 15 బస్సులను పక్కకు తప్పించారు. 4 అగ్నిమాపక శకటాల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని