మంత్రుల విహంగ వీక్షణం
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

మంత్రుల విహంగ వీక్షణం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మహానగర వ్యాప్తంగా ఆదివారం జరగనున్న గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జన వేడుకల్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హోమంత్రి మహమూద్‌ అలీ విహంగ వీక్షణం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నగరమంతా చూడనున్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కూడా వారి వెంట ఉంటారు. సాయంత్రం 4 గంటలకు మరోసారి విహంగ వీక్షణం ఉంటుంది.

మంత్రి తలసాని సమీక్ష.. శోభాయాత్ర, నిమజ్జన వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వివిధ శాఖల అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.ట్రాఫిక్‌ ఆంక్షలున్న నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే.. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే అడ్డంకులన్నీ తొలగి గణపతి శోభాయాత్రకు అవకాశం దక్కిందని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, భగవంతరావు పేర్కొన్నారు. శనివారం మంత్రి తలసానిని ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని