Crime News: ఫేస్‌బుక్‌ స్నేహంతో ఇంటికి ఆహ్వానం.. నగలు చోరీ చేసిన మిత్రుడు
eenadu telugu news
Published : 19/09/2021 07:43 IST

Crime News: ఫేస్‌బుక్‌ స్నేహంతో ఇంటికి ఆహ్వానం.. నగలు చోరీ చేసిన మిత్రుడు


రాజ్‌కుమార్‌ రావత్‌

మేడిపల్లి(బోడుప్పల్‌): ఫేస్‌బుక్‌లో పరిచయమైన మిత్రుడు నగలు అపహరించిన ఘటన మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి విహరికా కాలనీకి చెందిన బాలకృష్ణకు.. ముంబాయి జోగేశ్వరి ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ రావత్‌ (27) ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. దానికి ఆయన అంగీకరించారు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. రావత్‌ అక్కడ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల కిందట రావత్‌ బాలకృష్ణ ఇంటికి వచ్చి ఉన్నారు. తిరిగి వెళ్తూ.. ఆయన ఇంట్లోని ఏడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. రావతే ఆ పని చేశాడంటూ బాలకృష్ణ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. డీఐ మక్బుల్‌జానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముంబాయికి ప్రత్యేక బృందాన్ని పంపించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నగలు స్వాధీనం చేసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని