‘నిమజ్జన’ వాహనం పైనుంచి పడి యువకుడి మృతి
eenadu telugu news
Published : 21/09/2021 02:13 IST

‘నిమజ్జన’ వాహనం పైనుంచి పడి యువకుడి మృతి

శోభాయాత్రలో ఘటన

అబిడ్స్‌, జియాగూడ, న్యూస్‌టుడే: వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న  వాహనంపై ఓ యువకుడు నృత్యం చేస్తూ కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున అబిడ్స్‌ ఠాణా పరిధిలోని జీపీవో వద్ద జరిగింది. సీఐ ప్రసాద్‌రావు కథనం ప్రకారం.. జియాగూడలోని కేశవస్వామినగర్‌కు చెందిన జై భవానీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేశుడిని నిమజ్జనం నిమిత్తం ఆదివారం సాయంత్రం టస్కర్‌ వాహనంపై తరలిస్తున్నారు. అర్ధరాత్రి వాహనం అబిడ్స్‌ జీపీవో వద్దకు చేరుకోగా.. టస్కర్‌పై నృత్యం చేస్తున్న యువకుల్లో గణేశ్‌(22) కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన యువకుడిని  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువకుడి మృతితో కేశవస్వామినగర్‌లో విషాదం అలుముకుంది. స్థానికంగా టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించే గణేశ్‌కు మంచి పేరుందని చుట్టుపక్కల వారు తెలిపారు.  కేసు నమోదు చేసి సీఐ ప్రసాద్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గణేశ్‌ ఉత్సవ సమితి నేతలు కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని