నిజాన్ని నిర్భయంగా చెప్పేది జర్నలిజం
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

నిజాన్ని నిర్భయంగా చెప్పేది జర్నలిజం

పురస్కార గ్రహీతలతో అతిథులు

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే జర్నలిజానికే సాధ్యమని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కార గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ అధినేత బండారు సుబ్బారావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి రవీంద్రభారతిలో ‘సీల్‌వెల్‌ సినీ సుస్వరాలు’ శీర్షికన ‘ఆకాశవీధిలో అందాల జాబిలి’ పేరిట అక్కినేని సినీ గీతాల విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధమాన కథానాయకుడు ఉదయ్‌శంకర్‌ను ‘అక్కినేని యువనట పురస్కారం’తో సత్కరించారు. అక్కినేని-శృతిలయ జీవన సాఫల్య పురస్కారాలను భగీరథ, సీనియర్‌ జర్నలిస్టులు ఎ.ప్రభు, పి.నాగేంద్రకుమార్‌లకు అందజేశారు. ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను డి.నందకిషోర్‌, కిషోర్‌దాస్‌, పిమ్మరాజు శ్రీనివాస్‌, చిలుకూరి హరిప్రసాద్‌, సయ్యద్‌ ఇస్మాయిల్‌, ఫొటో జర్నలిస్టు రవికాంత్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు (ఈనాడు) ఎల్‌.వేణుగోపాలనాయుడు, సీనియర్‌ జర్నలిస్టు మంజులత కళానిధి, నిరుపమలకు అందజేశారు. సభలో ప్రముఖ సాహితీవేత్త డా.ఓలేటి పార్వతీశం, శృతిలయ ఛైర్మన్‌ బొక్కా భీమ్‌రెడ్డి, అధ్యక్షురాలు గుడ్ల ధనలక్ష్మి, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫీ, గాయకుడు చంద్రతేజ, సామాజికవేత్త డా.జి.అనూహ్యరెడ్డి, ఆదర్శ ఫౌండేషన్‌ డా.కుసుమ భోగరాజు, ఎల్‌.పురుషోత్తమ్‌గౌడ్‌ మాట్లాడారు. అంతకు ముందు గాయని ఆమని సారథ్యంలో ఆలపించిన అక్కినేని సినీ గీతాలు అలరించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని