నకిలీ లైసెన్స్‌తో డబుల్‌ బ్యారెల్‌ గన్‌
eenadu telugu news
Published : 25/09/2021 02:37 IST

నకిలీ లైసెన్స్‌తో డబుల్‌ బ్యారెల్‌ గన్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: నగరంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేందుకు డబుల్‌ బ్యారెల్‌ గన్‌కు నకిలీ లైసెన్స్‌తో వచ్చిన బిహార్‌వాసిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు వివరాల ప్రకారం... బిహార్‌లోని ఆర్వాల్‌ జిల్లా మీర్జాపూర్‌ గ్రామానికి చెందిన రాజారాం(38) ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కాపలాదారుగా పనిచేసేవాడు. అక్కడ సరైన ఉపాధి లేక నగరానికి వచ్చాడు. శుక్రవారం సికింద్రాబాద్‌లో ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో అతడి వద్ద ఉన్న డబుల్‌ బ్యారెల్‌ గన్‌, యూపీ లైసెన్స్‌ వివరాలను వారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు తెలియజేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు లైసెన్స్‌ నకిలీదిగా తేలడంతో రాజారాంతో పాటు గన్‌నూ స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని