వారధి నిర్మించి ఇబ్బందులు తీరుస్తా: మహేశ్‌రెడ్డి
eenadu telugu news
Published : 18/10/2021 02:27 IST

వారధి నిర్మించి ఇబ్బందులు తీరుస్తా: మహేశ్‌రెడ్డి


వాగు వద్ద స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: వాగుపై వంతెన నిర్మింపజేసి తండా వాసుల సమస్య తీరుస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మండలం నజీరాబాద్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మైసమ్మగడ్డ తండాకు వెళ్లాలంటే వాగును దాటేందుకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం ఎంపీపీ అరవింద్‌రావు, విపణి ఛైర్మన్‌ సురేందర్‌, మాజీ పాల డైరెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డిలతో కలిసి ఆప్రాంతాన్ని సందర్శించి హామీ ఇచ్చారు. సర్పంచి గణేష్‌ తదితరులున్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

పరిగి గ్రామీణ: రాపోల్‌ గ్రామ మాజీ సర్పంచి సుందర్‌ తల్లి ఇటీవల మృతి చెందారు. తెరాస నాయకులతో కలిసి ఆదివారం గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని