నిమ్స్‌కు సెలవు.. రోగులకు ఇక్కట్లు
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

నిమ్స్‌కు సెలవు.. రోగులకు ఇక్కట్లు

ఈనాడు, హైదరాబాద్‌: మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రిలో ఓపీ సేవలకు మంగళవారం సెలవు ప్రకటించారు. అయితే వారం క్రితం వైద్యం కోసం ఇక్కడికి వచ్చిన కొంత మంది రోగులకు ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ పరీక్షలకు ఇదే రోజు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల నుంచి ఆసుపత్రికి వచ్చారు. ఈ రోజు సెలవని, మరుసటి రోజు రావాలని సిబ్బంది చెప్పడంతో ఊసూరుమని తిరిగి వెళ్లారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని