ఇఫ్లూ రిజిస్ట్రార్‌పై హక్కుల కమిషన్‌ ఆగ్రహం
eenadu telugu news
Published : 26/10/2021 06:02 IST

ఇఫ్లూ రిజిస్ట్రార్‌పై హక్కుల కమిషన్‌ ఆగ్రహం

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఓ కేసుకు సంబంధించిన వివరాలతో నివేదిక సమర్పించాలని పలుమార్లు నోటీసులిచ్చినా.. స్పందించకపోవడంపై ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ) రిజిస్ట్రార్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడం నేర్చుకోవాలని మందలించింది. జాతీయ జెండాకు వందనం చేయనీయకుండా తమ ప్రాథమిక హక్కును వర్సిటీ అధికారులు కాలరాశారంటూ పీహెచ్‌డీ స్కాలర్స్‌ కె.శ్రీనాథ్‌, జి.కుమార్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఇటీవల ఎస్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌కు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రార్‌ స్పందించకపోవడంతో మళ్లీ ఆదేశాలిచ్చింది. పట్టించుకోకపోవడంతో అక్టోబరు 4న వారెంట్‌ జారీ చేసింది.  సోమవారం కమిషన్‌ సభ్యుడు ఆనందరావు ముందు హాజరైన రిజిస్ట్రార్‌ను మందలించడంతో.. ఆయన కమిషన్‌కు క్షమాపణలు కోరారు. రిజిస్ట్రార్‌ అభ్యర్థన మేరకు  విచారణను నవంబరు 5కు కమిషన్‌ వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని