కొత్త సంవత్సరానికి కొంగొత్త వారధులు
eenadu telugu news
Published : 27/10/2021 03:37 IST

కొత్త సంవత్సరానికి కొంగొత్త వారధులు


షేక్‌పేట నాలా రోడ్డు పైవంతెన

ఈనాడు, హైదరాబాద్‌: నగర వాసులకు కొత్త సంవత్సరం కానుకగా రెండు పై వంతెనలను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. మెహిదీపట్నం, హైటెక్‌సిటీ మధ్య వాహనాల రాకపోకలను సులభతరం చేసేలా.. టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడలి వరకు షేక్‌పేట నాలా రోడ్డుపై నిర్మిస్తోన్న పైవంతెన అందులో ప్రధానమైనది. పనులు 95శాతం పూర్తయ్యాయి. తుది మెరుగుల దశలో ఉన్నాయి. ఆరు లైన్ల వెడల్పు, 2.8కి.మీ పొడవుతో రూపుదిద్దుకుంటున్న పైవంతెన ప్రాజెక్టును రూ.333.55కోట్లతో జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఒవైసీ కూడలి నుంచి మిధాని కూడలి అవతలి వరకు తలపెట్టిన పైవంతెన నిర్మాణం సైతం చివరి దశలో ఉంది. ఆరు లైన్ల వెడల్పుతో, 1.5కి.మీ పొడవున, రూ.42కోట్లతో ఈ నిర్మాణం చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని