పొగాకు ఉత్పత్తులతో అయిదుగురి అరెస్టు
eenadu telugu news
Published : 29/07/2021 01:31 IST

పొగాకు ఉత్పత్తులతో అయిదుగురి అరెస్టు

మైదుకూరు, న్యూస్‌టుడే: నిషేధిత పొగాకు ఉత్పత్తులతో స్థానిక గంగమ్మ ఆలయం వద్ద ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బీవీ చలపతి తెలిపారు. వీరి నుంచి రూ.3,68,730 విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తుల సంచులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన గుర్రంపాటి వెంకటసుబ్బారెడ్డి, ఖాజీపేటకు చెందిన సుంకు ప్రహ్లాదలు కర్ణాటక రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి నిషేధిత పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసేవారన్నారు. వీరు సరఫరా చేసిన ఉత్పత్తులను పురపాలక పరిధి శ్రీనగరంకు చెందిన చెరువు మహ్మద్‌గౌస్‌, ఖాజీపేటకు చెందిన సల్లగాల్ల వెంకటసుబ్బయ్య, మైదుకూరు పట్టణానికి చెందిన అద్దంకి సురేష్‌కుమార్‌లు తీసుకుని వెళ్తూ ఉండగా అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని