రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం


పెద్దిరాజు (దాచినచిత్రం)

కొండాపురం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లెకి చెందిన పెద్దిరాజు (41) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌.ఐ. విద్యాసాగర్‌ వివరాల మేరకు మండలంలోని దొరువుపల్లెకి చెందిన వెంకటేష్‌తో కలిసి పెద్దిరాజు ద్విచక్ర వాహనంపై తాళ్లప్రొద్దుటూరులోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో కూలీ పనులకు బయలుదేరారు. మార్గమధ్యలో దత్తాపురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పెద్దిరాజు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రున్ని తాడిపత్రిలోని వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్యతోపాటు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌.ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని