Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంట్లోనే వేడుకలు.. అదే శ్రీరామరక్ష

నేడు నిరాడంబరంగా శ్రీసీతారామల కల్యాణోత్సవాలు

అంజనాద్రి గుట్టపై కల్యాణోత్సవం వేడుకలకు ఏర్పాట్లు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి విజృంభించడంతో అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. రాత్రి వేళ కర్ఫ్యూ మంగళవారం నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. బుధవారం శ్రీరామ నవమి పూజలు ఇంట్లో చేసుకుని, ఆలయాల్లో జరిగే కల్యాణోత్సవం టీవీ, సామాజిక మాధ్యమాల్లో వీక్షించడమే భక్తులకు శ్రీరామరక్ష అవుతుందని పండితులు అంటున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీరామ నవమి సందర్భంగా జరిగే పూజా, కల్యాణోత్సవాలకు భక్తులను అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురితో పాటు దేవాదాయ శాఖ ఆలయాల్లో అంతరాలయంలోనే కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. మంగళవారం రాత్రి ఎదుర్కొళ్లు , ఇతరాత్ర పూజా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీరామ నవమిని ఏటా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. దాదాపు అన్ని దేవాలయాల్లో ఈ వేడుకలకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలోనే కరోనా మహమ్మారి విజృంభణతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మందిరాల్లో కరోనా నిబంధనల ప్రకారం ఆలయ ఉద్యోగులు, అర్చక పండితుల మధ్య ఈసారి కల్యాణోత్సవం నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని