Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

50 కేంద్రాల్లో కొవిడ్‌ టీకా

జిల్లా పాలనాధికారి శశాంక

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి శశాంక

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో 50కేంద్రాల్లో కొవిడ్‌ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి కె.శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగవంతంపై రాష్ట్ర వైద్యాధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం 31 కేంద్రాలు ఉన్నాయని, వీటిని 50కి పెంచాలన్నారు. నాలుగైదు రోజుల్లో 60కేంద్రాలకు పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఏర్పాట్లు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో కరీంనగర్‌ ఆర్డీవో, మానకొండూర్‌ నియోజకవర్గంలో జడ్పీ సీఈఓ, హుజూరాబాద్‌లో ఆర్డీవో, చొప్పదండి నియోజకవర్గంలో డీఆర్‌డీవో, కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్‌ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌ తీసుకురావడానికి హైదరాబాద్‌లో ప్రతిరోజు ఒక వాహనాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో 2.44లక్షలు 45ఏళ్లు దాటిన వారున్నారని, ఇప్పటి వరకు 90వేల మంది టీకా తీసుకున్నారని, మిగతా 1.5లక్షల మంది వచ్చే 10రోజుల్లో టీకా వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాలో ప్రతిరోజు 15వేల టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8గంటలకే వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో కమిషనర్‌ వల్లూరు క్రాంతి, రాష్ట్ర వైద్యబృందం సభ్యుడు డాక్టర్‌ అశోక్‌కుమార్‌, డాక్టర్‌ రాజేశం, డాక్టర్‌ శ్రవణ్‌రెడ్డి, డాక్టర్‌ జగన్నాథరెడ్డి, జిల్లా అధికారులు రమేశ్‌, శ్రీలత, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

ప్రైవేటు వైద్య కళాశాలల్లో చికిత్స ప్రారంభించాలి

కరీంనగర్‌ పట్టణం : జిల్లాలోని ప్రతిమ, చల్మెడ వైద్యవిద్య కళాశాలల్లో కొవిడ్‌ రోగులకు వెంటనే చికిత్స ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ కె.శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మెడికల్‌ కళాశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెండు ఆసుపత్రుల్లో ఒక్కొక్కటీ వెయ్యి పడకల సామర్థ్యం ఉందని, ఇప్పటివరకు కొవిడ్‌ చికిత్స ప్రారంభించలేదన్నారు. ప్రతిమ, చల్మెడ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ కొరత ఉందని తెలుపగా సమస్యలుంటే మా దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు డాక్టర్‌ అమీత్‌, డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, క్షయ నివారణాధికారి రవీందర్‌ తదితరులు ఉన్నారు.

విస్తృత ఏర్పాట్లు...

చైతన్యపురి : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొవిడ్‌ రోగుల చికిత్స నిమిత్తం విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి శశాంక అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ముందుగా ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రాన్ని సందర్శించి కొవిడ్‌ పరీక్ష నిర్ధారణ నిమిత్తం ట్రైరన్‌ నిర్వహించి వెంటనే ల్యాబ్‌ను వినియోగంలోకి తేవాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజనరేటర్‌ ప్లాంటును పరిశీలించి వెంటనే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పర్యవేక్షకురాలిని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న షెడ్డులో రెండో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. కరోనా వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్‌ రత్నమాల, ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య, డాక్టర్‌ అలీం, డాక్టర్‌ శ్రీనువాస్‌, డాక్టర్‌ సమీర్‌ పాల్గొన్నారు.

జిల్లాలో 168 మందికి కరోనా

కరీంనగర్‌ పట్టణం : రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో 168 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరంతా ఆసుపత్రులలో, హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని