వేధిస్తే సహించేది లేదు: ఈటల
logo
Published : 17/06/2021 19:14 IST

వేధిస్తే సహించేది లేదు: ఈటల

హుజూరాబాద్‌: తన మద్దతుదారులను వేధిస్తున్నారని.. అలా చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. ప్రజలు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారని అన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా? అని నిలదీశారు. 2024 ఎన్నికలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఒక రిహార్సల్‌ లాంటిదన్నారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజూరాబాద్‌ వేదిక అయిందని.. రేపటి నుంచి ఇంటింటికీ వెళ్తానని ఈటల స్పష్టం చేశారు.

భాజపా తీర్థం పుచ్చుకున్న తర్వాత మొదటిసారి హుజూరాబాద్‌ వచ్చిన ఈటలకు అభిమానులు, భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గానికి చేరుకున్న ఈటల నాలుగు రోజుల పాటు హుజూరాబాద్‌లోనే ఉంటూ నాగారం, నగురంలో పర్యటించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని